ప్రేమ సూక్తులు

నేటి ఆధునిక ప్రపంచంలో ప్రేమించని, ప్రేమించుకోని యువతీ యువకులు ఉండకపోవచ్చు. ఇలాంటి వారి కోసం.. కొన్ని ప్రేమ సూక్తులు.

నిజానికి ప్రేమ కలిగించేటంత బాధ, వ్యధ ఈ ప్రపంచంలో ఇంకేమీ కలిగించవు. రానంతసేపు రాలేదనే బాధ, వచ్చాక విడిపోతామేమోననే బాధ, ఇదే ప్రేమంటే.
ప్రేమ నాదం లాంటిది. మీటితే అనురాగాన్ని ఇస్తుంది.
ప్రేమ వేదం లాంటిది. చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది.
ప్రేమ స్వతహాగా రావాలి. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు.
జీవితం పువ్వులాంటిది. అందులోని మకరందమే ప్రేమ.

ప్రేమ అంగట్లో దొరికే వస్తువు కాదు. అది స్వతహాగా మనసులో పుట్టుకొచ్చే పుట్టుమచ్చలాంటిది.
ప్రేమ ఉన్నతమైనదని చాటి చ్పెపిన తొలి వ్యక్తి విషాదాన్నే చవి చూసుంటాడు.
ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.
పెళ్ళయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించటం అన్నింటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.
ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.

ఒకరి అందం, అర్హతల వల్ల మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తన వల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.
ప్రేమ ఇంధ్రధనస్సు అయితే ఆ ఏడు రంగులూ – “ఆకర్షణ, అవగాహన, ఇష్టం, తాదాత్మ్సత, స్పర్శ, కామం, ఓదార్పు”
ప్రేమంటే సముద్రపు చెరో రెండు అంచుల చివర నిలబడ్డా, ఈ దరి నుంచి ఆ దరికి ప్రవహించే తరంగాల్లా ఒకరి స్మృతులు మరొకరికి చేరాలి.

ప్రేమ, పైరూ ఒకలాంటివే. “ముందు మనసనే భూమిని దున్నాలి. స్నేహమనే విత్తనం వేయాలి. చిరునవ్వుల ఎరువులు జల్లాలి. ఆప్యాయంతో వర్షంలా కురవాలి. అపార్థాల కలుపు తీయాలి. కులమతం, రాజకీయం అనే చీడల నుండి రక్షించుకోవాలి. అప్పుడుగానీ ప్రేమ అనే పైరు చేతికిరాదు.”

ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోవవ్వాలి.
కళ కన్న ప్రేమ గొప్పది. ప్రేమ కన్నా జీవితం గొప్పది.
ప్రేమ కోపాన్ని చంపుతుంది. చిరునవ్వుని పుట్టిస్తుంది.

ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది.
ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో…
ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *